Thursday, August 14, 2008

ఎస్సై గారు పిలుస్తున్నారు

నెనప్పుడు నాలుగొ తరగతనుకుంట. స్కూల్లొ ఆగస్టు 15 కి డెకరేషన్లు చేసి ఎవరికి ప్రైజులొచ్చాయొ, ఎందుకొచ్చాయొ, ఎలాంటివొచ్చాయొ మాట్లాడుకుంటు స్కూల్లొ ఇచ్చిన బిస్కట్లు, చాక్లెట్లుతింటు మధ్యాహ్నానికి ఇంటికి బయల్దేరాం.
మా ఇల్లు స్కూలుకి కొంచెం దగ్గరే.స్కూలు మెయిను రోడ్డు మీద రైల్వే గేటు దగ్గర,మా ఇల్లు అదే రోడ్డులొ కొంచెం ముందుకి వెళ్తే గరువు మీద.

పిల్లమందరం ఎంతో సంతోషంగామాట్లాడుకుంటూ రోడ్డు మీదే గట్టిగా అరుస్తూ, అల్లరి చేస్తూ వస్తున్నాము.

అలా ఎప్పుడు గరువు మొదట్లోకి వచ్చామో తెలీదు.హఠాత్తుగా మా ఎదురుగా ఒక కానిస్టేబులు నుంచుని మమ్మల్ని ఆగమన్నట్టుగా సైగ చేస్తూ మా దగ్గరికి వచ్చారు. ఈ కానిస్టేబులు రోడ్డుకావైపునున్నఇంకో కానిస్టేబుల్ని అడుగుతున్నాడు వీళ్ళేనా అని.

మాకేమీ అర్ధం కావట్లేదు. మమ్మల్ని వీళ్ళెందుకు ఆగమంటున్నారో అని.

దారిలొ వస్తున్నప్పుడు అంత ఎక్కువ అల్లరి చేసేమా?

లొపలికి తీసుకెళ్ళి కొడతరా??

మా ఇంట్లో వాళ్ళకి చెప్తారా??? అని చాలా సందేహాలొచ్చాయి నాకు.

ఇంతలొ ఎస్సై కుడా బయటికి వచ్చి మమ్మల్ని తీస్కురమ్మన్నట్టుగా సైగ చేసారు.
వెంటనే కానిస్టేబులు మమ్మల్ని ఎస్సై గారు పిలుస్తున్నారు పదండి అన్నారు.
పిల్లలందరము కుక్కిన పేనుల్లా కానిస్టేబులు వెనకాలే వెళ్ళాము.
మమ్మల్ని స్టేషను లొపలికి తీసుకెళ్ళారు.

లొపలికి వెళ్ళగానే ఆశ్చర్యం.
లొపల బోల్డన్ని బిస్కెట్లు చాక్లెట్లు ఉన్నాయి.
ఎస్సై మమ్మల్ని కావల్సినన్ని తీస్కొమన్నారు.

మేము తీసుకుని బయటికొచ్చాక మా చేత జాతీయ గీతం పాడించి జెండాకి సెల్యూట్ చేయించి పంపించేసారు.
ఇది జరిగి ఎన్ని సంవత్సరాలైనా నాకు ప్రతీ ఆగస్టు 15కి గుర్తొస్తుంది ఈ సంఘటన.

మీ అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
జై హింద్.

--------------------------------------------

Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Labels: ,

5 Comments:

Blogger రానారె said...

సూపర్! బాగుంది. :-)
గరువు అంటే ఏమిటి?

August 15, 2008  
Blogger kiraN said...

:D
అది మా ఇల్లు ఉండే ఏరియా పేరు.

-కిరణ్

August 15, 2008  
Blogger చైతన్య said...

బాగుంది :)

August 15, 2008  
Blogger సూర్యుడు said...

గరువు అంటే డ్రై లాండ్ అని, వెట్ లాండ్ కి ఆపోసిట్. సాధారణంగా వెట్ లాండ్ లో వరి మొదలైనవి పండిస్తారు, డ్రై లో వేరుశనగ, సజ్జ మొదలైనవి పండిస్తారు

August 16, 2008  
Blogger రానారె said...

ఎస్సైగారు పిలిచి చాన్నాళ్ళైపోలా!? :-)

October 05, 2008  

Post a Comment

<< Home