Thursday, January 11, 2007

చిలక చమత్కారం - ౨

రంగారావు ఇంటి ముందు నుంచి వెళుతోంది కాంతమ్మ. ఆమెను చూసి రంగారావు పెంచుకుంటున్న చిలక 'ఓయ్ కాంతమ్మా! తిక్క మొహం దానా' అని అరిచింది. సాయంత్రం అదే దారిలో తిరిగొస్తుంటే చిలక మళ్ళీ 'ఓయ్ కాంతమ్మా! తిక్క మొహం దానా' అంది.

కోపంతో ఆవిడ చిలక యజమాని రంగారావు దగ్గరకెళ్ళి గొడవ పెట్టుకుంది. మరోసారి అలా అనకుండా చూస్తానని సర్దిచెప్పి పంపాడు రంగారావు.

మర్నాడు మళ్ళీ అదే దారిలో వెళుతున్న ఆవిడని 'ఓయ్ కాంతమ్మా' అని పిలిచింది చిలక. కోపంగా చూసింది కాంతమ్మ. 'ఆ తర్వాతేంటో నీకు తెలుసులే' అంది చిలక.



Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

6 Comments:

Anonymous Anonymous said...

భలే పట్టుకొస్తారండీ మీరు. మీ జొకులు చాలా బాగుంటాయ్.

విహారి
http://vihaari.blogspot.com

January 11, 2007  
Blogger రాధిక said...

telivayina cilaka.

January 11, 2007  
Blogger రానారె said...

వాహ్ వా!! ఫక్కున నవ్వు తెప్పించావు. ఫస్ట్‌క్లాస్ జోకు. థాంక్స్.

January 11, 2007  
Blogger kiraN said...

@విహారి - ఈ చిలక జోకుల్ని ఆదివారం ఈనాడు పుస్తకం నుంచి కొట్టుకొచ్చా.

@రాధిక - అవును చాలా తెలివైంది.

@రాము - ధన్యవాదాలు.

January 11, 2007  
Blogger చైతన్య said...

:) :) :)
చాలా బాగుంది :)

January 15, 2007  
Blogger రాధిక said...

నా బ్లాగులో మీ కామెంటు కి నా స్పందన ఇది.http://snehama.blogspot.com/2007/01/blog-post_15.html
నేనన్నది అదేనండి ఆనందం అనేది ధనం తో రాదు అని."ధనం వచ్చేకొద్దీ
ఆనందం విలువ పెరిగిపోతుందా?"
అంటే డబ్బు వచ్చే కొద్దీ ఆనందాన్ని కూడా కొనుక్కొవాలిసివస్తుంది.ఏమి ఖర్చు చేయకుండా పొందగలిగే ఆనందాన్ని ఎక్కువ డబ్బు సంపాదించేకొద్దీ ఖర్చు చేసి ఆనందాన్ని కొనుక్కుంటున్నాము అని నా వుద్దేస్యం అండి.ఉదాహరణకి వానలో తడిసి ఆనందించిన రోజులు వదిలి....డబ్బు సంపాదించాకా,వయసుపెరిగాకా రెయిన్ డాన్సులని వేలకి వేలు ఖర్చు చేసి ఆనందపు విలువను పెంచేసం కదా.అదన్న మాట.ఇప్పుడు అర్దం అయిందనుకుంటాను నా బాధ.

January 29, 2007  

Post a Comment

<< Home