Thursday, May 10, 2007

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!! ౨

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!! అంటున్నాడు రాము,
అవును బతికించుకోవడమేమిటి??
ఎవరు ప్రయత్నిస్తున్నారు బతికించుకోవడానికి??

౨౦౦౨ లో అందరి లానే అమీర్‌పేట్ లో మల్టీమీడియా కోర్స్ నేర్చుకున్నా. ప్రతీ రోజూ గాంధీ నగర్ నుంచి అమీర్‌పేట్ కి వచ్చి వెళ్ళేవాడిని. ఒక రోజు అలా బస్సులో తిరిగి వెళ్ళేప్పుడు నా పక్కన ఒకతను కూర్చున్నాడు(క్షమించాలి, అతని పేరు గుర్తులేదు). అతని చేతిలో డ్రాయింగ్ పుస్తకమొకటి ఉంది. మీరు ఆర్టిస్టా అని అడిగాను, కాదు అంటూ ఆ పుస్తకాన్ని చూపించాడు. అందులో ’అ, ఆ’ ల నుంచి తెలుగులోని వదిలిపెట్టేసిన అచ్చులు వరకు ఉన్నాయి. తెలుగు భాషలో ఏవి వదిలేసారో, ఎందుకు వదిలేసారో అన్నీ వివరంగా చెప్పారు. అలా నేను ఎన్నో విషయాలు అతని ద్వారా తెలుసుకున్నాను. నిజంగా తెలుగు భాష తియ్యనైనదే, అందులో సందేహం లేదు. కాకపోతే ఒక ’ముస్లిం’ ఇన్ని విషయాలు ఎలా చెప్పగలరు? అవును అతనొక ముస్లిం. పేరు ఖాదర్ అన్నట్టు గుర్తు. తెలుగు నేర్చుకోవడానికి వచ్చే విదేశీయులకి కేవలం ౫(ఐదు) రోజుల్లో నేర్పుతారంట. ఇటువంటి వారు ఉన్నంతవరకు తెలుగు భాషని బతికించుకోవడాలు, రక్షించుకోవడాలు అవసరం లేదు.



Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

9 Comments:

Blogger చైతన్య said...

hmm... "oka muslim inni vishayalu ela cheppagalaru?"

hindi matrubhasha aina oka vyakthi... telugu matrubhasha aina manaki telugu bhasha gurinchi cheppaaru... ante... manam e paristhithi lo unnaamo okasari alochinchaali...

brathikinchalsindi bhashani kaademo...

May 10, 2007  
Blogger rākeśvara said...

రానారె గారి టపా చదివి బాధ వేసినా, మీది చదివి ఆనందం వేసింది. ఇస్మయిల్ గారు కూడా ఈ కోవకు చెందిన వారే..
http://krishnadevarayalu.blogspot.com/

చైతూ గారు,
ఆయని మాతృభాష ఉర్దు అయ్యుంటుంది.

May 11, 2007  
Blogger రానారె said...

ముస్లిం మతస్థులైన గొప్పగొప్ప పండితులూ కవులూ ఉన్నారు మనకు :)ఆంధ్ర ప్రదేశములో పుట్టిన/పెరిగిన ప్రతివారూ తెలుగువారే. తెలుగుభాష హిందూమతానికి సంబంధించినదే అయి ఉండనవసరం లేదుకదా. కాబట్టి ఆశ్చర్యపోనవసరం లేదేమో. అంతేకాదు, సినారె లాంటి కొందరు కవులకు ఉర్దూ పాండిత్యం ఉందని విన్నాను.

May 11, 2007  
Blogger Naveen Garla said...

కొందరేమిటి....లెక్కకు మిక్కిలిగా ఉన్నారు ముస్లిం తెలుగు పండితులు / రచయితలు. వారిలో ఖదీర్ బాబు అంటే తెలియనిది ఎవ్వరికి...ఆయన రచనలు ఇష్టం కానిది ఎవ్వరికి

May 15, 2007  
Blogger అగంతకుడు said...

maa nellUrlO musliMlaMdarU telugu baagaanE maaTlaaDataaru. khadhIr baabu nellUrE kadaa!
#internet# puNyamaa ani manaM chakkagaa ilaa telugulO maaTlaaDukOvaDaM eMtO AnaMdadAyakaM.
venkat
www.24fps.co.in

May 16, 2007  
Blogger అగంతకుడు said...

మా నెల్లూర్లో ముస్లింలందరూ తెలుగు బాగానే మాట్లాడతారు. ఖధీర్ బాబు నెల్లూరే కదా!
internet పుణ్యమా అని మనం చక్కగా ఇలా తెలుగులో మాట్లాడుకోవడం ఎంతో ఆనందదాయకం.
venkat
www.24fps.co.in

May 16, 2007  
Blogger spandana said...

అయ్యొయ్యో! భాషకూ మతానికీ ముడిపెట్టకండి. ఏ మతం వారైనా తెలుగు మాట్లాడే అందరూ తెలుగు వారే!

--ప్రసాద్
http://blog.charasala.com

May 25, 2007  
Blogger Bhãskar Rãmarãju said...

మా ఊళ్ళో ఉర్దు ఇలా మాట్లాడతారు
ఖాసిం, సైదా తో ఇలా అంటాడు
"సైద! పందిరిపే చొప్పకట్టా దాల్ రే" అని.

May 25, 2007  
Blogger Unknown said...

అవును నిజమే.నా పేరు మొయిన్. షేక్ అంటారులే Officeలొ. నాకు కుడా తెలుగంటే చాల ఇష్టం.Bhasker Raju Satireకి ఇంకొ జొడి ఉంది `నిన్నా మొన్న్నా కిదర్ గయా రె` `కంగారు కైకు రె`

May 28, 2007  

Post a Comment

<< Home