Friday, March 30, 2007

ఇంటర్వూ ఎటూ లేదు

ఇంటర్వూ ఎటూ లేదు ఇంటికైనా వెళ్ళు బ్రదర్..
ఇంటర్వూ ఎటూ లేదు ఇంటికైనా వెళ్ళు బ్రదర్..
హైద్రాబాదు నగరంలో ప్రతి కంపెనీ నీదీ నాదే బ్రదరూ..
ఈ హై టెక్కు నగరంలో జాబులకేమీ కొదవ లేదు బ్రదర్ ర్ ర్.. ర్.. ర్..
ఇంటర్వూ ఎటూ లేదు

మన అమ్మ మైక్రోసాఫ్టు.. మన అన్న బిల్గేట్సు..
మన అమ్ము సాఫ్టువేరు రా.. తమ్ముడూ..
మన దమ్ము ఐ. టీ బూము రా..
డిగ్రీలు పుచ్చుకుని, బుక్సు చేత పట్టుకుని..
హైద్రాబాదు (మైత్రీ వనమ్) చేరినాము, కోర్సులెన్నొ నేర్చినాము..
ఐ.టి ని పాలించే భావి ప్రాజెక్ట్ మేనేజర్లం బ్రదర్..
ఇంటర్వూ ఎటూ లేదు

ఐబిఎమ్, డెల్ మనవి.. ఒరకిల్, టీసీఎస్ మనవి..
వాకిన్ కి వెళ్ళొద్దామురా.. వెళ్ళీ.. ఉద్యోగం పట్టెద్దామురా..

డెబ్బై శాతం, ఎనభై శాతం రాకుంటే మన తప్పా..
డెబ్బై శాతం, ఎనభై శాతం రాకుంటే మన తప్పా..

మంచి మార్కులివ్వలేని యూనివర్సిటీదే తప్పా.. ఆ.. ఆ..
మంచి మార్కులివ్వలేని యూనివర్సిటీదే తప్పా..
పర్సంటేజీ లేకున్నా జాబ్ కి అప్లై చెయ్ బ్రదర్..
ఇంటర్వూ ఎటూ లేదు

హై క్లాసు కూలీలం.. సాఫ్టువేరు బానిసలం..
డాలర్ల దాసులమ్మురా.. తమ్ముడూ.. మనసుకు శాంతి కరువురా..
ముందేమో జాబు లేదు.. వచ్చాక జీతం నచ్చలేదు..
హైకో రామచంద్రా అంటే జీతం పెంచే దిక్కే లేదు..
దేవుడిదే భారమని నౌకరిలో రెస్యూమ్ పెట్టు బ్రదర్ ర్ ర్.. ర్.. ర్..
ఇంటర్వూ ఎటూ లేదు



Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

3 Comments:

Blogger రాధిక said...

హ హ...భలె వుంది.కత్తిలాంటి పేరడీ.

March 30, 2007  
Blogger చైతన్య said...

lol.... :)
anukovataniki funny ga unnaa.. mana s/w industry lo andari experience inchu minchu ilage untundi...

good one kiraN :)

April 01, 2007  
Blogger vijju said...

కరెక్ట్గ్ గా బ్లాగిన ఒక సవంత్సరం తరువాత చదువుతున్నాను... చాలా బాగుందండి... మన సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి బాగా పేరడి చేసారండి.

March 31, 2008  

Post a Comment

<< Home