Thursday, January 11, 2007

చిలక చమత్కారం - ౨

రంగారావు ఇంటి ముందు నుంచి వెళుతోంది కాంతమ్మ. ఆమెను చూసి రంగారావు పెంచుకుంటున్న చిలక 'ఓయ్ కాంతమ్మా! తిక్క మొహం దానా' అని అరిచింది. సాయంత్రం అదే దారిలో తిరిగొస్తుంటే చిలక మళ్ళీ 'ఓయ్ కాంతమ్మా! తిక్క మొహం దానా' అంది.

కోపంతో ఆవిడ చిలక యజమాని రంగారావు దగ్గరకెళ్ళి గొడవ పెట్టుకుంది. మరోసారి అలా అనకుండా చూస్తానని సర్దిచెప్పి పంపాడు రంగారావు.

మర్నాడు మళ్ళీ అదే దారిలో వెళుతున్న ఆవిడని 'ఓయ్ కాంతమ్మా' అని పిలిచింది చిలక. కోపంగా చూసింది కాంతమ్మ. 'ఆ తర్వాతేంటో నీకు తెలుసులే' అంది చిలక.



Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Sunday, January 07, 2007

చిలక చమత్కారం

'వెధవా, ఇడియట్, స్టుపిడ్, రాస్కెల్..' అంటూ కొత్తగా తిట్టడం నేర్చుకుంది రంగారావు పెంచుకుంటున్న మాట్లాడే చిలక.

దాన్నెలాగైనా దారిలోకి తేవాలని తిండి పెట్టడం మానేసాడు రంగారావు.

అయినా అది తిట్లు మానలేదు.

దాంతో ఒక రోజు ఆ చిలుకను తీసుకెళ్ళి ఫ్రిజ్ లో పెట్టాడు. చలికి తట్టుకోలేక అప్పుడైనా తన మాట వింటుందని.

కాసేపటికి చిలక అరుపులు వినిపించి ఫ్రిజ్ తలుపు తీసాడు.

'నీకు దణ్ణం పెడతాను. నన్ను బయటికి తియ్యి. ఇక జన్మలో తిట్టను. '

చిలకని ఫ్రిజ్ లోంచి బయటికి తీసాడు రంగారావు, అప్పుడు అది అడిగింది ' అది సరే గానీ.. అన్ని మాటలన్నా నన్ను తిట్టకుండా కొట్టకుండా లోపల పెట్టావు కదా! ఆ కోడి ఏమని తిట్టిందీ.. ఈకలు వలిచి మరీ లోపల పెట్టావు' ఆసక్తిగా అడిగింది లోపలున్న చికెన్ ని చూపిస్తూ.



Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..