Thursday, May 31, 2007

మావాళ్ళనీ పాడు చేయకండి

మీకెలాగూ బుద్దిలేదు...
వాళ్ళే వద్దని వార్నింగ్ ఇచ్చినా... అదే చేస్తారు.
మేము ఎలాగూ పాడైపోయాం.. మళ్ళీ మావాళ్ళని కూడా ఎందుకు పాడుచేస్తారు?
మానేయండి లేదా ఛస్తారు!!


ఇట్లు
మీ మానవ శరీర అవయువాలు
(Human Body Parts)

సహకారం : లిప్ కాన్సెర్, లంగ్ కాన్సెర్, ఓరల్ కాన్సెర్ ఇంకా వగైరా వగైరా కాన్స్‌ర్స్(ఎందుకంటే ఎన్నున్నాయో మాకు సరిగ్గా లెక్క తెలీదు కాబట్టి)

******

అంతగా కాల్చుకోవాలంటే బాగా దూరంగా వెళ్ళి కాల్చుకోండి
లేదా
ఇక్కడికి వెళ్ళి రేడియో వినండి
voicewibes




Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Labels:

Thursday, May 10, 2007

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!! ౨

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!! అంటున్నాడు రాము,
అవును బతికించుకోవడమేమిటి??
ఎవరు ప్రయత్నిస్తున్నారు బతికించుకోవడానికి??

౨౦౦౨ లో అందరి లానే అమీర్‌పేట్ లో మల్టీమీడియా కోర్స్ నేర్చుకున్నా. ప్రతీ రోజూ గాంధీ నగర్ నుంచి అమీర్‌పేట్ కి వచ్చి వెళ్ళేవాడిని. ఒక రోజు అలా బస్సులో తిరిగి వెళ్ళేప్పుడు నా పక్కన ఒకతను కూర్చున్నాడు(క్షమించాలి, అతని పేరు గుర్తులేదు). అతని చేతిలో డ్రాయింగ్ పుస్తకమొకటి ఉంది. మీరు ఆర్టిస్టా అని అడిగాను, కాదు అంటూ ఆ పుస్తకాన్ని చూపించాడు. అందులో ’అ, ఆ’ ల నుంచి తెలుగులోని వదిలిపెట్టేసిన అచ్చులు వరకు ఉన్నాయి. తెలుగు భాషలో ఏవి వదిలేసారో, ఎందుకు వదిలేసారో అన్నీ వివరంగా చెప్పారు. అలా నేను ఎన్నో విషయాలు అతని ద్వారా తెలుసుకున్నాను. నిజంగా తెలుగు భాష తియ్యనైనదే, అందులో సందేహం లేదు. కాకపోతే ఒక ’ముస్లిం’ ఇన్ని విషయాలు ఎలా చెప్పగలరు? అవును అతనొక ముస్లిం. పేరు ఖాదర్ అన్నట్టు గుర్తు. తెలుగు నేర్చుకోవడానికి వచ్చే విదేశీయులకి కేవలం ౫(ఐదు) రోజుల్లో నేర్పుతారంట. ఇటువంటి వారు ఉన్నంతవరకు తెలుగు భాషని బతికించుకోవడాలు, రక్షించుకోవడాలు అవసరం లేదు.



Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..