Wednesday, May 31, 2006

గేదె కూర్చుంది!! 2

నేను: నాన్నా గేదె కూర్చుంది!!
నాన్న: ఇట్టియ్యా ఇదేంట్రా ఇలా కుర్చుని లెగట్లేదు
ఇట్టియ్య: ఎమోరా, నేను ఎప్పుడూ చూళ్ళేదు ఇలాగ
నాన్న: ఇందాక కర్రతొ కొట్టాను
నేను: నాన్నా గేదె కూర్చుంది

ఇట్టి మాయ గేదెని చాలా సేపు జాగ్రత్తగా పరిశీలించాడు. కానీ ఎమీ అర్థం కాలేదు.

ఇట్టియ్య: ఎంతసేపయ్యింది??
నాన్న: పావుగంట పైనే అయ్యింది
ఇట్టియ్య: సత్తిరాజూ (మా నాన్న గారి పేరు సత్యనారాయణ మూర్తి, సత్తిరాజంటారు) గేదె ఇంక ఐపోయింద్రా. దాని సట్ట జారిపొయింది. ఇంక గేదె పనిచెయ్యదు.
నాన్న: డాటర్ని పిలుద్దాంరా. అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళారు.
నేను: నాన్నా..
నాన్న: ఒరేయ్ నోర్ముయ్ (నా వంక చూడకుండానే)
మళ్ళీ పిలిచాను పలకలేదు
నేను ఎంత పిలిచినా పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు గేదెని ఏం చేద్దామా అని.
నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను,
నేను: నాన్నా..
నాన్న: ఓరేయ్ ఇంకోసారి గేదె కుర్చుంది అన్నవంటే నిన్ను కూడా దాని పక్కనే కుర్చోపెడతాను అన్నారు.
అది కాదు నాన్నా, ఒకసారి ఇలా చూడు అంటూ గేదెని చూపించాను
నాన్న, ఇట్టి మాయ ఆశ్చర్యపోతూ అడీగారు 'ఏం చెసావ్' అని
నేనేమీ చెయ్యలేదు కాస్త పచ్చ గడ్డి వేసానంతే అన్నాను.
అక్కడ గేదె గడ్డి మేస్తోంది కుర్చుని కాదు నుంచుని.


Photobucket - Video and Image Hosting Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Saturday, May 27, 2006

గేదె కూర్చుంది!!

అప్పుడు నాకు 13 సంవత్సరాలు. ఎనిమిదో క్లాసు చదువుతున్నాను. మా ఊరి పేరు పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా.

మాకు 'గొల్లవాని చెరువు' అనే ఊరిలో కాస్త పొలం వుండేది(ఈ ఊరు పాలకొల్లుకి 3 కిమి దూరం). రోజూ పొద్దున్నే 5గంటలకు నేను మా నాన్నగారు చెరొక సైకిల్ మీద బయలుదేరి పొలం వెళ్ళేవాళ్ళం. మేము వెళ్ళే దారి చివరి 2కిమి రైలుపట్టాల పక్కన వుండే చిన్ని దారిలో సాగేది. ఆ చిన్ని దారిలో సైకిల్ తొక్కుకుంటూ, పచ్చని పొలాల్నీ, చెట్లనీ, మంచుతో తడిసిన గడ్డినీ, రకరకాల పక్షుల్నీ, సూర్యోదయాన్నీ చూసుకుంటూ, పలకరించుకుంటూ వెళ్ళేవాడిని. ఈ రైలు పట్టాల పైనే రూపాయల్ని తప్పడ చేసిన సందర్భాలూ వున్నాయి :)

మా పొలంలోనే వుండే పాకలో మాకు రెండు గేదెలు ఒక ఆవు వుండేవి. ఇందులో 'కొమ్ముల గేదె' అనే ఒక గేదె వుండేది. దాని మీదెక్కి కూర్చోడం, కొమ్ములు పట్టుకు లాగడం, అది కాలువలో దిగినప్పుడు దాని తల నీళ్ళల్లో ముంచడం(ఊపిరి పీల్చుకోకుండా 5నిమిషాలు పాటు వుండేది) ఇలా సాగేవి దానితో నా ఆటలు.

ఒక రోజు నాకొక అనుమానం వచ్చి, మా నాన్న గార్ని అడిగాను, 'నాన్నా, గేదెలు కూర్చోవా?' అని. కూర్చోలేవురా అన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఒక రోజు సాయంత్రం నేను పొలం వెళ్ళాను. ఆ రోజు కొమ్ముల గేదె సరిగ్గా మాట వినడం లేదంట, అందుకని మా నాన్నగారు కర్రతో సరిగ్గా ఒక్కటిచ్చుకున్నారు. వెంటనే గట్టిగా అరిచారు నన్ను రమ్మని. మామిడి చెట్టు మీద ఆడుకుంటున్న నేను పరుగెత్తుకుని వెళ్ళి చూద్దును కదా అక్కడ గేదె కుర్చునుంది. మా ఇద్దరికీ ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ముందుగా నేను 'నాన్నా, గేదె కూర్చుంది' అన్నాను. వెంటనే మా నాన్నగారు దాన్ని అదిలించారు, కాని చలనం లేదు.

నేను: నాన్నా గేదె కూర్చుంది!!
నాన్న: ఒరేయ్, వెళ్ళి ఇట్టి మాయని పిల్చుకురా
(ఇట్టి మాయ: ఇతని పేరు విష్ణు. నాకు మావయ్య అవుతారు. మా పొలం పక్కనే ఇల్లు).
నేను: నాన్నా గేదె కూర్చుంది!!
నాన్న: అవున్రా. కన్పిస్తోంది. ముందు నువ్వెళ్ళి ఇట్టి మాయని పిలు.
నేను: ఐతే OK అని పరిగెత్తుకుని వాళ్ళింటికి వెళ్ళాను
ఇట్టియ్య: ఏంట్రా?
నేను: ఇట్టి మాయా త్వరగా రా, నాన్న పిలుస్తున్నారు.
ఇట్టియ్య: ఏమయ్యిందిరా??
నేను: గేదె కూర్చుంది!!
ఇట్టియ్య: గేదె కూర్చొవడమేంట్రా??? అంటూ బయల్దేరాడు

మిగిలింది తర్వాత చెప్తా..
మర్చిపోవద్దే.. మళ్ళీ రండి.



Photobucket - Video and Image Hosting Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Thursday, May 18, 2006

శ్రీశ్రీ

కుక్క పిల్లా,
అగ్గి పుల్లా,
సబ్బు బిళ్ళా--
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టె ముక్కా,
అరటి తొక్కా,
బల్ల చెక్కా--
నీ వేపే చూస్తూ ఉoటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపు గొళ్ళెం,
హారతి పళ్ళెం,
గుఱ్ఱపు కళ్ళెం--
కాదేదీ కవితకనర్హం!
ఔనౌను శిల్ప మనర్ఘం!
ఉండాలోయ్ కవితావేశం!
కానీవోయ్ రస నిర్దేశం!
దొరకదటోయ్ శోభాలేశం!
కళ్ళంటూ ఉంటే చూసి,
వాక్కుంటే వ్రాసీ!
ప్రపంచమొక పద్మవ్యూహం!
కవిత్వమొక తీరని దాహం!

'మహా ప్రస్థానం' నుంచి.
శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983)

Saturday, May 13, 2006

తియ్యని మాట - అమ్మ

అమ్మను పూజించు
ఏ దేవుడ్నీ మొక్కే అవసరం రాదు నీకు.

Wednesday, May 10, 2006

ప్చ్...

ప్చ్...


Photobucket - Video and Image Hosting Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..
ఎన్ని తలమునకలైపోయే పనులున్నా రోజులో ఒక్కసరైనా నవ్వండి.

Tuesday, May 09, 2006

నిన్నంతా.. నిన్నటి సుత్తికి కొనసాగింపు

నిన్నటి (నిన్నంతే..) పోస్ట్ కి ఇది కొనసాగింపు. అది చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్ చదవండి, లేకపోతే అర్ధం కాదు. కుదర్దు అంటారా ఇక మీ ఇష్టం. తల నొప్పి వచ్చింది, బొప్పి కట్టింది అంటే నాకు సంబంధం లేదు.

నాకు ఫోన్ లేదు కానీ నంబర్ వుంది. అన్నయ్య ఫోన్ కొంటానని తీసుకెళ్ళి నోకియా(FM Phone) చూపించాడు. అదంటే నాకు ఇష్టం వుండదు(యాక్). కానీ, కొన్ని నోకియా ఫోన్స్ లో Camera క్వాలిటీ చాలా బాగుంటుంది.
ఐతే OK అన్నాను. కానీ మొటరోలా కొన్నాము.

ఫోన్ ఎప్పుడు కొనుక్కుంటావు అని అడిగే ఒకళ్ళకి వెంటనే ఫోన్ చేసి చెప్పాను కొన్నానని. మంచిది అని ఫోన్ పెట్టేసారు(నిద్ర మత్తులో వున్నార్లే).

ఐతే OK అనుకున్నాను.


ఈ నా సుత్తిని నిన్న మరియు ఈరోజు ఓపిగ్గా చదివి భరించినందుకు నాకు చాలా సంతోషంగా వుంది.

అసలు విషయం ఏమిటంటే ఇన్ని ఐతే OK లు నా జీవితంలో ఏ రోజూ లేవు.
అవునండి, ఇంకో ఐతే OK వుంది.

సరే సరే.. ఇదే చివరిది.
ఇన్ని ఐతే OKల్ని బ్లాగ్ లొ పోస్ట్ చేద్దామని అంతా టైప్ చేసాక కరెంట్ పోయింది(UPS పని చెయ్యలేదు) :( .
ఐతే OK అనుకుని మళ్ళీ టైప్ చేసుకుని పోస్ట్ చేసాను.


Photobucket - Video and Image Hosting Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..
ఎన్ని తలమునకలైపోయే పనులున్నా రోజులో ఒక్కసరైనా నవ్వండి.
--------------------------------------------------------------------
ముఖ్య గమనిక: మన తెలుగు బ్లాగర్లందరూ కలుసుకోవటానికి కిరణ్ కుమార్ చావా గారు call for this months meet అనే ప్రోగ్రాం పెట్టారు. ఇష్టం వున్నా లేకున్నా రావల్సిందిగా బెదిరిస్తున్నాను.

నిన్నంతా..

పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుందామని చూస్తే పేస్ట్ లేదు.
ఐతే OK అని వెళ్ళి తెచ్చుకున్నా.

అన్నయ్య ఆఫీస్ కి త్వరగా వెళ్ళాడు(ఇద్దరమూ ఒకటే ఆఫీస్).
ఐతే OK అని నేను ఆటోలో వెళ్ళాను.

ఆఫీస్ లొ 'నెట్' లేదు.
ఐతే OK అని నా పని చేసుకున్నాను ;)

లంచ్ తెమ్మని ఆఫీస్ బోయ్ కి చెప్తే, అఫీస్ లో అందరు బయటికి వెళ్తున్నారు అని చెప్పాడు.
ఐతే OK అని నేనూ వాళ్ళతో వెళ్ళాను.

నాకు ఎగ్జామ్స్ వున్నాయ్ కదా త్వరగా వెళ్దామని మా సీనియర్ కి చెప్పాను. బయల్దేరే టైమ్ కి వర్షం మొదలైంది.
ఐతే OK అని ఆగిపోయను.

బయల్దేరే టైమ్ కి మళ్ళీ వర్క్ ఇచ్చారు,
ఐతే OK అని కంప్లీట్ చేసి వెళ్ళాను.

పనుంది, మిగిలింది తర్వాత చెప్తా..



Photobucket - Video and Image Hosting Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

Monday, May 08, 2006

సుస్వాగతం

ఐతే OK,

హుమ్ మ్ మ్...
ఇంకా ఏదో రాద్దామనుకున్నా, కానీ మర్చిపోయాను :( ఈ సారికి ఇలా కానిద్దాం..
గుర్తు వచ్చినప్పుడు రాస్తాలే..



మరొకసారి దయచేయండి